ఆలాంటి ఆలోచన ఏదీ లేదు : భారత్
సంక్షోభం సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉండేందుకు భారత్ ముందుకు వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ దేశంలో కొనసాగుతున్న నిరసనలను కట్టడి చేసేందుకు భారత్ బలగాలను పంపుతుందన్న వార్తలలు అక్కడ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలంకలోని భారత రాయబారా కార్యాలయం వాటిని తోసిపుచ్చింది. ఇటువంటి నివేదికలు, అభిప్రాయాలు భారత ప్రభుత్వం పరిశీలనలో కూడా లేవని తేల్చి చెప్పింది. ఇంకో పక్క అధ్యక్ష, ప్రధాని అధికారిక నివాస భవనాల్లో ఆందోళనకారులు, వంట, జిమ్ చేస్తూ, ఈత కొడుతూ, పడక గదిలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి.













