అమెరికా నివేదికను ఖండించిన భారత్
దేశంలో మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయంటూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నివేదికను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ఆ నివేదికపై తీవ్రంగా స్పందిస్తూ అమెరికా సీనియర్ అధికారుల అవగాహనా రహిత వ్యాఖ్యలు అని విమర్శించింది. అంతర్జాతీయ సంబంధాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటూ వ్యాఖ్యానించింది. ప్రేరేపించబడిన సమాచారం, పక్షపాత అభిప్రాయాలు ఆధారంగా ఈ నివేదిక రూపొందించడిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విమర్శించారు. భారత్ సహజంగానే బహుళ సమాజమని, మత స్వేచ్ఛ, మానవ హక్కులకు విలువనిస్తుందని తెలిపారు. అమెరికాతో తాము జరిపే చర్చల్లో అక్కడ జరిగే వర్ణ వివక్ష దాడులు, విద్వేషపూరిత నేరాలు, తుపాకీ సంస్కృతి వంటి అంశాలపై తరుచుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటామని తెలిపారు.













