అమెరికాలో ఇండియా గివింగ్ డే
భారత్కు సంఫీుభావంగా, దేశాభివృద్ధికి చేయూతనిచ్చేందుకు అమెరికాలో ఉన్న ఎన్నారైలకు చెందిన వివిధ స్వచ్ఛంద సంస్థలు ఉమ్మడిగా మార్చి 2న ఇండియా గివింగ్ డే నిర్వహించనున్నాయి. ఇండియా ఫిలాంత్రపీ అలయెన్స్ (ఐపీఏ) పేరుతో సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అగస్య యూఎస్ఏ, ఆకాంక్ష ఎడ్యుకేషన్, అఖండ జ్యోతి యూఎస్ఏ, అమెరికన్ ఫ్రెండ్స్ ఆఫ్ హెల్పేజ్ఇండియా, అమెరికన్ ఇండియా ఫౌండేషన్, ఆరోగ్యవరల్డ్, అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ ద ఎన్విరాన్మెంట్ (యూఎస్ఏ) వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. భారీ మొత్తాలను విరాళంగా అందజేయాలని కోరడంలేదని, 10 డాల్లం చొప్పున ఇచ్చినా సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అశిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. యూఎస్`ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ కూడా ఇండియా గివింగ్ డే కు మద్దతు తెలిపింది.













