అగ్రరాజ్యంను దాటేసిన భారత్
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పంపిణి చేయడంలో అగ్రరాజ్యం అమెరికాను భారత్ దాటేసిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు ప్రతిరోజూ దేశంలో సగటున 30.93 లక్షల డోసులతో వ్యాక్సినేషణ్ చేసినట్లు తెలిపింది. మొత్తం 8.70 కోట్ల డోసులను లబ్ధిదారులకు అందించినట్లు పేర్కొంది. టీకా తీసుకున్న తర్వాత పాజిటివ్ నిర్ధారణ అవుతున్న వారి సమచారాన్ని సేకరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన శాంపిల్ రెఫరెన్స పత్రాని ఆరోగ్యశాఖ విడదల చేసింది. టీకా తీసుకున్నాక పాజిటివ్ వచ్చిన వారు.. ఈ పత్రంలో ఆధార్ నంబరు, పాస్పోర్టు సంఖ్య, వ్యాక్సిన్ పేరు, డోసు తీసుకున్న తేదీలను ఇందులో రాయాల్సి ఉంటుంది.













