కెనడా వెళ్లే భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరికలు
కెనడాలో విద్వేష దాడులు పెరిగిపోతున్నాయని, కాబట్టి ఆ దేశం వెళ్లే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కెనడా వెళ్లే విద్యార్థులు, ఇతర పనుల మీద వెళ్లే భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులకు వ్యతిరేకంగా కెనడాలో విద్వేష దాడులు, నేరాలు, మూక దాడులు పెరిగిపోయాయని పేర్కొన్న భారత విదేశాంగ శాఖ.. కెనడాకు వెళ్లే భారతీయులంతా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరింది. అలాగే ఈ దాడుల గురించి కెనడా ప్రభుత్వంతో చర్చలు జరిపామని కూడా తెలిపింది. కెనడా వెళ్లే వాళ్లు ఒట్టావాలోని ఇండియన్ మిషన్ లేదా టొరంటో, వాంకూవర్లలో ఉన్న భారత కాన్సులేట్లలో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది.













