భారత్, అమెరికాల మధ్య కీలక ఒప్పందం
భారత్, అమెరికాల మధ్య కీలక, ఆధునిక సంకేతికతల (ఐసీఈటీ) అభివృద్ధి సమకారాలకు సంబంధించిన కీలక ఒప్పందం కుదిరింది. కృత్రమ మేధ, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో కలిసి ముందుకు వెళ్లేందుకుగాను ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ మేరకు శ్వేతసౌధం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్, అమెరికాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరో మెట్టు పైకి ఎక్కిందని అందులో స్పష్టం చేసింది. తాజాగా అమెరికా చేరుకున్న భారత జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోభాల్, అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేకే సలివాన్తో భేటీ అనంతరం, ఐసీఈటీపై ఒప్పందం కుదిరిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.













