అగ్రరాజ్యంతో మంచి సంబంధాలు : పాకిస్తాన్

అగ్రర్యాజం అమెరికాతో తాము మంచి సంబంధాలు కోరుకుంటున్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఉగ్రవాదంపై యుద్ధం సమయంలో అమెరికాతో తమ బంధాలు కొద్దిగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ పోరులో పాకిస్తాన్‍కు సాయం చేస్తున్నట్లు అమెరికా భావించింది. దీనికి ప్రతిఫలంగా అమెరికా చెప్పినట్లుగా పాక్ చేయాలని అనుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ఉన్న బంధాల వంటితే తాము కూడా అమెరికాతో ఏర్పరచుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.