భారత విద్యార్థుల కోసం.. భారీ స్కాలర్ షిప్ లు
బ్రిటన్కు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఇంపీరియల్ కాలేజీ లండన్ భారత విద్యార్థుల కోసం భారీ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ద ప్యూచర్ లీడర్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం కింద వచ్చే మూడేళ్లలో భారత్కు చెందిన ప్రతిభ గల 30 మంది మాస్టర్స్ స్కాలర్స్ విద్యార్థులను ప్రోత్సహించనుంది. ఈ క్రమంలో 15 మంది పురుష, 15 మంది మహిళా విద్యార్థులకు ప్రయోజనం దక్కనుంది. భారత సైంటిస్టుల కోసం ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. భిన్న నేపథ్యాలు కలిగిన అత్యంత ప్రతిభావంతులను ఆకట్టుకోవడానికి, వారి అభ్యున్నతికి మద్దతివ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం అని ఇంపీరియల్ కాలేజీ లండన్ ప్రొఫెసర్ పీటర్ హయ్ నెస్ వెల్లడిరచారు.













