ఇలాగైతే కరోనా కట్టడికి.. ఏండ్లు పట్టొచ్చు

అమెరికా దేశాల్లో కొవిడ్ 19 వ్యాప్తి ఇలాగే కొనసాగితే, మమమ్మారిని అదుపులోకి తీసుకురావడానికి ఏండ్లు పడుతుందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పీఏహెచ్‍వో) తెలిపింది. గడిచిన వారంలో ఉత్తర, మధ్య అమెరికా దేశాల్లో 12 లక్షల కేసులు, 34 వేల మరణాలు నమోదైనట్టు వెల్లడించింది. లాటిన్ అమెరికా, కరేబియన్ దీవులు, మధ్య అమెరికా దేశాలకు వ్యాక్సిన్ డోసులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అభిప్రాయపడింది.