కెనడా వెళ్లే విద్యార్థులకు.. శుభవార్త

కెనడాలో చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఎయిర్ కెనడా విమానాల్లో ప్రయాణించే విద్యార్థులకు ఐడీపీ ఎడ్యుకేషన్ సంస్థ.. విమాన టికెట్ ధరలో రాయితీ కల్పించనుంది. ఈ మేరకు ఎయిర్ కెనడాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా కెనడాకు వెళ్లాలనుకుని, తమ సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకుంటే టికెట్ ధరలో 15శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది.