డాక్టర్ రఘురామ్ కు బ్రిటీష్ పురస్కారం
కిమ్స్ ఉషాముళ్లపూడి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజ్ ఫౌండర్ సీఈవో డాక్టర్ పి.రఘురామ్కు బ్రిటిష్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ఓబీఈ అవార్డును అందుకున్నారు. విండ్సర్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పిన్న వయసు భారతీయ వైద్యుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించే క్వీన్ ఎలిజబెత్`2 ఆనర్ లిస్టులో డాక్టర్ రఘురామ్ పేరును చేర్చినట్లు లండన్ గెజెట్లో ప్రచురించారు. బ్రిటిష్ రాజకుటుంబం అందించే రెండవ అత్యుత్తమ ర్యాంకింగ్గా ఓబీఈ అవార్డుకు గుర్తింపు ఉంది.













