ట్విట్టర్ కొత్త సీఈవోగా భారతీయుడు
సోషల్ నెట్వర్క్ సంస్థ ట్విట్టర్ సీఈవో జాక్ బోర్సి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీఈవో) పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. డోర్సీ రాజీనామా తక్షణ మే అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది. 2022 వరకు కంపెనీ బోర్డులో డోర్సీ కొనసాగుతారని ట్విట్టర్ జారీ చేసిన ప్రకటనలో వెల్లడించింది. కంపెనీ ఫౌండర్స్ నుంచి బయటకి వచ్చేందుకు సిద్దంగా ఉన్న నేపథ్యంలో తాను వైదొలగాని నిర్ణయించుకున్నట్టు డోర్సీ తన సందేశంతో తెలిపారు.













