తమ పౌరులకు అమెరికా సూచన.. భారత్ కు

భారత్‍లో ఉన్న తన పౌరులను అందుబాటులో ఉన్న విమానాలు పట్టుకుని వెంటనే తిరిగి రావాలంటూ అమెరికా కోరింది. భారత్‍కు ఎవరూ వెళ్లవద్దని కూడా తమ పౌరులకు సూచించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వైద్యపరమైన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాకు వచ్చేవారిలో రెండేళ్లు, అంతకు మించిన వయసున్నవారంతా 3 రోజుల్లోపు తీసుకున్న కొవిడ్ నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. భారత్‍లో ఉన్న తమ పౌరులు అమెరికా చేరుకోవాడానికి ఉన్న అవకాశాలను వివరించింది. యునైటెడ్ ఎయిర్‍లైన్స్, ఎయిర్ ఇండియాలు భారత్ నుంచి నేరుగా పలు విమానాలను నడుపుతున్నట్లు పేర్కొంది. అలాగే ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, ఖతార్ ఎయిర్‍వేస్ విమానాల్లో ప్యారిస్, ఫ్రాంక్‍ఫర్ట్, దోహాల మీదుగా కూడా చేరుకోవచ్చని తెలిపింది.