అమెరికా నగరాల్లో బిల్ బోర్డులు
ఇస్లాం, క్రైస్తవ మతం మధ్య సారూప్యతను వివరించే సందేశాలతో కూడిన బిల్‌బోర్డులు అమెరికా లోని పలు నగరాల్లో వెలిశాయి. హ్యూస్టన్ లోని బిజీ హైవేలో వెలిసిన ఓ బోర్డుపై ముస్లింలు యేసును ప్రేమిస్తారు అనే సందేశం కనిపించింది. ఈ బోర్డు డ్రైవర్ల దృష్టిని ఆకర్షించింది. ఒక దేవుడు అదే ప్రవక్త సందేశం అనే అర్థం వచ్చేలా హైవే పొడవునా బోర్డులు కనిపించాయి. వీటిని ఇల్లినాయిస్కు చెందిన గెయిన్పీస్ అనే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. దేవుడిపై ఉన్న అపోహలు తొలగించేందుకు అమెరికాలోని చికాగో, డల్లాస్, సెంట్రల్ న్యూజెర్సీల్లోనూ బోర్డులను పెట్టించింది. గెయిన్ పీస్ అనేది ఓ ఎన్జీవో. ఇస్లాంపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది.













