వలసలపై.. జో బైడెన్ మరో సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివిధ కారణాలతో అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇచ్చేలా ఓ కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. సెనేట్లో ఈ బిల్లు ఆమోదం పొందడంతో లక్షలాది మంది భారతీయులకు మేలు కలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వలస వచ్చిన వారితో పాటు హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాకు వచ్చిన టెక్ నిపుణుల పిల్లలకు అమెరికా పౌరసత్వాన్ని అందించడమే తాజాగా అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశ పెట్టిన బిల్లు యొక్క ముఖ్యోద్దేశం. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ దేశ వలస విధానంలో విప్లవాత్మక మార్పులను తెచ్చే దిశలో ఇది అత్యంత కీలక ఘట్టం అని వ్యాఖ్యానించారు.













