క్యాపిటల్ భవనం వద్ద భద్రతకు.. 1.9 బిలియన్ డాలర్లు

అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద భద్రతను పెంచేందుకు 1.9 బిలియన్ డాలర్లు (రూ.13,870 కోట్లు) కేటాయించేందుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లు స్వల్ప ఆధిక్యంతో (213-212) గట్టెక్కింది. కాగా క్యాపిటల్ భవనం వద్ద జరిగిన 6న జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం స్వతంత్ర కమిషన్‍ను ఏర్పాటు చేసే బిల్లుకు ప్రతినిధుల సభలో డెమోక్రాట్లతో పాటు 35 మంది రిపబ్లికన్లు మద్దతు తెలిపారు.