అమెరికా ఆహ్వానాన్ని సగౌరవంగా సమ్మతిస్తున్నా : మోదీ
పరస్పర ప్రజాస్వామ్య విలువలు, ప్రజల దృఢమైన అనుబంధాల మీద నిర్మితమైన భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో ఘనమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యాల కోసం అత్యంత నిబద్ధతతో రెండు దేశాలు దీనికి కట్టుబడి ఉంటాయన్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాల్సిందిగా తనను ఆహ్వానించిన స్పీకర్ కెవిన్ మెకార్థితో పాటు సెనెటర్లో మెజారిటీ లీడర్, రిపబ్లికన్, డెమ్రోకటిక్ నేతలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆహ్వానాన్ని గౌరవంగా సమ్మతిస్తున్నట్లు పేర్కొన్నారు. యూఎస్ కాంగ్రెస్లో మరోసారి ప్రసంగించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.













