ప్రపంచ రికార్డు… 26 గంటల్లోనే

హాంకాంగ్ పర్వతారోహకురాలు సాంగ్ ఇన్-హుంగ్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని కేవలం 25 గంటల 50 నిమిషాల్లో అధిరోహించారు. ఇప్పటి వరకు మహిళల్లో ఇంత తక్కువ వ్యవధిలో ఎవరూ ఎవరెస్టును ఎక్కలేదు. శనివారం 1:20 గంటలకు బేస్ క్యాంప్ వద్ద బయలుదేరిన ఆమె 8,848.86 మీటర్ల (29,031 అడుగులు) ఎవరెస్ట్ను అధిరోహించి ఆదివారం సాయంత్రం 3:10 గంటలకు శిఖరానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు 39 గంటల 6 నిమిషాల్లో ఎవరెస్ట్ను అధిరోహించిన నేపాలీ మహిళ పుంజో ఝంగ్మూ లామా పేరిట ఉంది.