ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి
పాకిస్థాన్ పార్లమెంటు అయిన నేషనల్ అసెంబ్లీకి ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో తొలిసారిగా ఓ హిందూ మహిళ పోటీ చేయనున్నారు. ఓ మైనార్టీ మహిళ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. జనరల్ స్థానాల్లో 5 శాతం సీట్లను మహిళలకు తప్పకుండా కేటాయించాలని ఇటీవల ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సద్వినియోగం చేసుకొని ఆమె ఎన్నికల రంగంలో దిగారు. ఖైబర్ ఫక్తూంక్వా ప్రావిన్స్ బునేర్ జిల్లా స్థానం కోసం వైద్యురాలైన డాక్టర్ సవీర్ ప్రకాశ్ నామినేషన్ వేశారు. తనను పీపుల్స్ పార్టీ ఆఫ్ పాకిస్థాన్ (పీపీపీ) అధికారిక అభ్యర్థిగా గుర్తిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. రిటైర్డు డాక్టర్ అయిన ఆమె తండ్రి ఓం ప్రశాశ్ పీపీపీలో చురుకైనా నాయకునిగా కొనసాగుతున్నారు.













