భారత్ కోసం మేం చాలా చేస్తున్నాం : జో బైడెన్
కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొంటున్న భారత్‌కు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని, వైద్య సామగ్రిని పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆయన వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడాను. ఆయన కోరిన సాయాన్ని చేస్తున్నాం. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రిని భారత్‌కు అందజేశాం అని తెలిపారు. మరోవైపు ఆరు విమానాల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రిని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ భారత్‌కు చేరవేసినట్లు బైడెన్ తెలిపారు. ఆ దేశానికి అత్యవసరంగా కావాల్సిన వాటి గురించి అడిగి తెలుసుకున్నాను. టీకాల తయారీ కోసం ముడి పదార్థాలు కావాలని మోడీ అడిగారు. వెంటనే వాటిని పంపిస్తున్నాం. వాటితో పాటు ఆక్సిజన్ పంపిస్తున్నాం. ఇతర ప్రధాన వైద్య పరికరాలనూ సైతం చేరవేస్తున్నాం. ఇలా భారత్ కోస మేం చాలా చేస్తున్నాం అని తెలిపారు.













