అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగులపై వేటు!
హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఉద్యోగాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. పాలస్తీనియన్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న కారణంతో అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న నలుగుర్ని అక్కడి సంస్థలు ఉద్యోగం నుంచి తొలగించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. గాజాలోని హమాస్ శిబిరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలోని హార్వర్డ్, కొలంబియా బిజినెస్ స్కూల్కు చెందిన కొందరు విద్యార్థులు సంతకాలు సేకరించారు. దీనిని వారు పని చేస్తున్న సంస్థలు తీవ్రంగా పరిగణించాయి. హార్వర్డ్ స్కూల్లో చదువుతున్న ముగ్గురితో పాటు కొలంబియా యూనివర్సిటీకి చెందిన మరో విద్యార్థిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడిరచాయి. అయితే వాళ్ల పేర్లను మాత్రం బయట పెట్టలేదు. హమాస్, ఇజ్రాయెల్ పరిణామాలపై ఇప్పటికే అమెరికాకు చెందిన పలువురు వ్యాపార వేత్తలు, వివిధ సంస్థల సీఈవోలు కీలక ప్రకటనలు విడుదల ఏశారు. సంస్థ నిబంధనలను ఉల్లంఘించి ఏదైనా వర్గానికి మద్దతిస్తూ ప్రకటనలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.













