ఈ ఘటనలను మరవక ముందే.. అమెరికాలో మరోసారి
షికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మరణించడం, చైనా లూనార్ కొత్త సంవత్సరం వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది దుర్మరణం పాలైన ఘటనలను మరువక ముందే అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. కాలిఫోర్నియాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఉత్తర కాలిఫోర్నియాలోని హాప్మూన్ బే ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో రెaచున్లీ (చైనా జాతీయుడు) అనే వ్యవసాయ కార్మికుడు తోటీ కార్మికులపై కాల్పులకు తెగబడ్డారు. అక్కడి నుంచి పారిపోతూ కొద్ది దూరంలో మరోమారు కాల్పులు జరిపాడు. ఈ ఘటనల్లో ఏడుగురు చనిపోయారు. మరో ఘటన ఐయోవా నగరంలోని డెస్ మెయినెన్లో ఓ దుండగుడి కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు చేనిపోయారు.













