హెచ్- 1బీ వీసాదారులకు కష్టాలు…

అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు, ఇక్కడకు వచ్చి తిరిగి వెళ్ళాల్సినవారికి కష్టాలు మొదలయ్యాయి. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి. హెచ్ 1 బీ వీసాలు ఉన్న వారికి రెండు మార్గాలే కనిపిస్తున్నాయి. ఒకటి ఉద్యోగ కాలం పొడిగించుకోవటం, రెండోది అమెరికా వదిళి వెళ్లటం. వీసాల కోసం గ్రేస్ పీరియడ్ పొందినా అక్కడి నిబంధనల ప్రకారం మరోచోట ఉద్యోగం పొందటం తప్పనిసరి. కానీ కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అందువల్ల ప్రవాస భారతీయులకు అక్కడి ఉద్యోగం దొరకటం సాధ్యం కావటం లేదు. దీంతో అలాంటి ప్రవాసీయులు అమెరికాను విడిచివెళ్లాల్సివస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది హెచ్ 1 బీ వీసాలపై పనికోసం అమెరికాకు చేరుకుంటారు. వారిలో భారతీయుల సంఖ్య అత్యధికం. అక్కడ ఉద్యోగం పోయాక వారి పడకలు, సోఫాలు, ఇతర వస్తువులను అమ్ముకోవాల్సివస్తున్నది. గతేడాది పెద్ద సంఖ్యలో అక్కడ నిరుద్యోగులుగా మారారు. దీంతో వీసా పొడిగింపును తిరస్కరిస్తున్నట్టు ఓ భారతీయ ఇంజనీర్ తెలిపారు.