వాషింగ్టన్ లో కాల్పుల కలలకం
అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. దేశ రాజధాని వాషింగ్టన్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో మృతి చెందిన బెంటన్ కౌంటీనే ఫైరింగ్‌కు పాల్పడి ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుడు ఉపయోగించిన ట్రక్కు పశ్చిమ రిచ్‌ల్యాండ్‌లో పోలీసులకు లభించింది. వాహనం లోపల నుంచే కాల్పులు జరిపినట్టుగా తెలిపారు. ఈ విషయం తెలిసిన తర్వాత నిందితుడిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించినట్టుగా కెన్నెవిక్ పోలీస్ కెప్టెన్ ఆరోన్ క్లెమ్ చెప్పారు.
నిందితుడు ఉపయోగించిన ట్రక్కులో పేలుడు పదార్ధాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కాలిపోయిన ట్రక్కులో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రెండు మృతదేహాలను మరో ఇంట్లో గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ సాగుతుందని కెన్నెవిక్ పోలీసులు పేర్కొన్నారు.













