అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో విషాదకర ఘటన
అమెరికా మెక్సికో సరిహద్దుల్లో విషాదకర ఘటన జరిగింది. మెక్సికో వెళ్లిన ఓ గుజరాతీ కుటుంబం సరిహద్దు గోడ దూకి అమెరికాలో ప్రవేశించేందుకు యత్నించగా కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోయారు. బ్రిజ్కుమార్ యాదవ్ గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న జీఐడీసీలో పనిచేస్తున్నాడు. మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు తొలుత మెక్సికోకు చేరుకున్న బ్రిజ్ కుటుంబం 30 అడుగుల ఎత్తున్న గోడను దాటి అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దానిని ఎక్కే క్రమంలో బ్రిజ్ కుమార్ మరణించాడు. భార్య , మూఢ్లే కుమారుడు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై గాంధీనగర్ కలెక్టర్ భతర్ జోషి స్పందించారు. బ్రిజ్ కుమార్ తన కుటుంబంతో దేశం విడిచి వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారు ఆక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది అని అన్నారు. మెక్సికో నుంచి శరణార్థుల రాకను నిలువరించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ సరిహద్దులో భారీ గోడ నిర్మించారు.













