భారత్ కు అండగా ఉంటాం… సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి టెక్ దిగ్గజాలు స్పందించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు తనకుచాలా బాధకలిగించాయంటూ సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న తరుణంలో తీవ్ర ఆక్సిజన్ కొరత నేపథ్యంలో దేశానికి సహాయం అందించన్నుట్టు ప్రకటించారు. సహాయ ఉపశమన ప్రయత్నాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరుల ద్వారా నిరంతర మద్దతులో పాటు కీలకమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సమయంలో భారత్కు సాయం చేస్తున్నందుకు యూఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. భారతదేశంలో తీవ్రమవుతున్న కోవిడ్ సంక్షోభం చూసి తల్లడిల్లిపోతున్నట్టు చెప్పారు. గూగుల్ సంస్థ, ఉద్యోగులు కలిసి భారత ప్రభుత్వానికి రూ.135 కోట్ల నిధులను, వైద్యసామాగ్రి కోసం యునిసెఫ్, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడంతోపాటు, క్లిష్టమైన సమచారాన్ని అందించేందుకు సహాయ పడేలా నిధులను అందిస్తున్నామని సుందర్ పిచాయ్ వెల్లడించారు.













