గూగుల్ మాప్స్‌లో కొత్త ఫీచర్…
గూగుల్ తన మాప్స్‌లో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. తన నావిగేషన్ యాప్ వినియోగదారులకు మరింత అకట్టుకునేలా కొత్త ఆప్‌డేట్స్‌ను పారిస్‌లో జరిగన కార్యక్రమంలో కంపెనీ ప్రకటించింది. ఇమ్మర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్‌తో గూగుల్ మ్యాప్స్‌తో జత చేసింది. ప్రస్తుతం యూరప్‌లోని ఐదు కీలక నగరాల్లో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను త్వరలోనే మిగిలిన నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్‌లో మరింత సృష్టంగా ఆయా ప్రదేశాలను మనకు చూపించనుంది. గూగుల్ మ్యాప్స్‌లో సాధారణ స్ట్రీట్ వ్యూ ఫీచర్ లాగానే ఉంటుంది. మరిన్ని స్ట్రీట్ వ్యూ, ఏరియా ఇమేజెస్‌తో వర్చువల్ వరల్డ్ మోడల్‌ను అందిస్తుంది. వాతావరణం, ట్రాఫిక్, లొకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలుంటాయి. రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో ప్రపంచవ్యాప్తంగా గ్లాన్సబుల్ డైరెక్షన్స్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.













