మహిళల కోసం అంకుర పథకం : గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ మహిళా వ్యవస్థాపకుల కోసం ప్రత్యేకంగా ఒక అంకుర పథకాన్ని ప్రకటించింది. నిధుల సమీకరణ, నియామకాల్లో సవాళ్లను పరిష్కరించేందుకు ఈ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్ మహిళలకు సహకరిస్తుంది. గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సెలరేటర్ -ఇండియా ఉమెన్ పౌండర్స్ ప్రారంభ బ్యాచ్ కింద మహిళలు స్థాపించిన, సహ స్థాపకులుగా ఉన్న 20 అంకురానలు అంగీకరిస్తుంది. 3 నెలల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. అమెరికా, చైనాల తర్వాత భారత్‌లోనే అతిపెద్ద అంకుర వ్యవస్థ ఉంది. భారత్‌లో 100కు పైగా యూనికార్న్ (100 కోట్ల డాలర్ల విలువైన) సంస్థలున్నాయి. ఇందులో 2022లోనే 22 జత అయ్యాయి. అయితే 15 శాతం భారత యూనికార్న్‌లు మాత్రమే ఒకటి లేదా అంత కంటే ఎక్కువ మంది వ్యవస్థాపకులను కలిగి ఉన్నాయని గూగుల్ పేర్కొంది. తాజాగా ప్రకటించిన పథకం కింద నెట్‌వర్క్‌లు, మూలధనం, నియామకాలు, మెంటార్షిప్, వర్క్‌షాపులు, క్లౌడ్ ఆండ్రాయిడ్, వెబ్, ప్రొడక్ట్ వ్యూహాలు తదితర అంశాల్లో మద్దతునిస్తుంది.













