యూజర్ల కోసం గూగుల్ మరో ప్రయత్నం..
మరింత మంది యూజర్లకు చేరువ కావడానికి గూగుల్ మరో ప్రయత్నం చేస్తోంది. ఇక నుంచి సెర్చ్ రిజల్ట్స్ ఇంగ్లిష్‌లోనే కాకుండా మరో ఐదు భారతీయ భాషల్లో అందించనుంది. వచ్చే నెల నుంచి హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాళీ, మరాఠీ భాషల్లో సెర్చ్ రిజల్ట్స్ రానున్నట్లు గూగుల్ ఇండియా వెల్లడించింది. స్థానిక భాషకు సంబంధించిన ప్రశ్నను ఇంగ్లిష్‌లో టైప్ చేసినా కూడా అక్కడి భాషలో రిజల్ట్స్ వస్తాయని తెలిపింది. ఇంగ్లిష్తో పాటు స్థానిక భాషలో చదివే ఆసక్తి ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పింది.
నేడు జరిగిన ఎల్10ఎన్ వర్చువల్ ఈవెంట్లో ఈ కొత్త భాషలను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు వివిధ గూగుల్ ప్రొడక్ట్స్‌ను సంబంధించి ఇండియన్ మార్కెట్లో పలు కొత్త రకం ఫీచర్లను తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్‌ను ఇప్పుడు 9 భారతీయ భాషల్లోకి సులువుగా, వేగంగా మార్చే అవకాశం కలుగుతుంది. అంటే స్థానిక భాషలో ఇక నుంచీ ప్రదేశాల గురించి వెతకడంతో పాటు డైరెక్షన్స్ తెలుసుకోవచ్చు. ఇక గూగుల్ అసిస్టెంట్‌ను కూడా లాంచ్ చేసినప్పటి నుంచీ వివిధ భారతీయ భాషల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.













