గూగుల్ ఉద్యోగులకు సుందర్ పిచాయ్ షాక్
గూగుల్లో ఉద్యోగుల తొలగించేందుకు సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ పరోక్షంగా సంకెతాలు ఇచ్చారు. సంస్థలో ఉద్యోగుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక సమావేశంలో ఆయన ఉద్యోగుల పనితీరు సరిగాలేదని ప్రస్తావించారు. ఉత్పత్తులు, సేవలను మరింత మెరుగుపర్చాలని, కస్టమర్లు మన్న పొందడంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. గూగుల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే పనితీరు, ఉత్పాదకత సరైన స్థాయిలో లేదని పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
పనితీరు, ఉత్పాదకత సరిగాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల తొలగింపుకు పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చినట్లేనని భావిస్తున్నారు. 2022లో రెండో త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ఫలితాలు నిరాశ కల్గించాయి. కంపెనీ ఆధాయంలోనూ లాభాల్లోనూ క్షిణత చోటు చేసుకుంది. అమెరికాలో ఆర్థిక మాంధ్యం వస్తుందన్న అంచనాతో ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగుల నియామకాలను తగ్గిస్తున్నట్లు ఇటీవలే గూగుల్ ప్రకటిచింది. జరుగుతున్న పరిణామాలను బట్టి త్వరలోనే గూగుల్ సైతం ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.













