రష్యాకు గూగుల్ షాక్
ఉక్రెయిన్పై మాస్కో యుద్ధం నేపథ్యంలో గూగుల్ కూడా స్పందించింది. డబ్బు అర్జన నుంచి రష్యా దేశం మీడియా నియంత్రిస్తున్నట్లు అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇలాంటి చర్యలే దానీ అనుబంధ సంస్థ యూట్యూబ్, లాగే ఫేస్బుక్ సంస్థలు కూడా విధించాయి. ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న రష్యాపై చర్యల నేపథ్యంలో రష్యాకు చెందిన మీడియా సంస్థలపై గూగుల్ మోనెటైజేషన్ను నిలుపుదల చేసినట్టు గూగుల్ అధికార ప్రతినిధి ప్రకటించారు. కొత్త పరిణామాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు చేపడతామని అన్నారు. వీడియోల మోనెటైజింగ్ నుంచి రష్యన్ మీడియా చానెళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పటికే సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ రష్యా మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.













