అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు .. ఇదీ శుభవార్తే
ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది శుభవార్తే. అమెరికాలో జనవరి నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి గాను వీసా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గత విద్యా సంవత్సరంలో ఏకంగా 82 వేల మంది విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు జారీ చేసిన అమెరికా ఈసారి అంతకు మించి వీసాలు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వీసా జారీ ప్రక్రియాలో భారతీయ విద్యార్థులకు పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నేటి నుంచే వీసా స్లాట్లను విడుదల చేయనుంది. ప్రస్తుతం పర్యాటక, విద్యార్థి, ఇతర వీసాల కోసం 400 రోజులకు పైగా ఎదురుచూడవలసి వస్తోంది. మరోక వైపు ఈ నెలలో కొన్ని నవంబరు రెండవ వారంలో మరికొన్ని విద్యార్థి, వీసా స్లాట్లను విడుదల చేయనున్నట్లు అమెరికా రాయబార కార్యాలయంలోని మినిస్టర్ కాన్సులర్ హెఫ్లిన్ ఇప్పటికే ప్రకటించారు.













