అమెరికాలో అంగరంగ వైభవంగా…జర్మనీ అమ్మాయి, విశాఖ అబ్బాయికి
జర్మనీ అమ్మాయి, విశాఖ అబ్బాయి ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగింది. అంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని ఎస్బీఐ విశ్రాంతి అధికారి, విశాఖ కళాసాగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వానపల్లి శ్రీమన్నారాయణ కుమారుడు డైవిక్ సుశాంక్, జర్మనీకి చెందిన లిండా ముల్లర్ల స్నేహబంధం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరు పెద్దల్ని ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి, మూడు మూళ్ల బంధంలో ఒక్కటయ్యారు. ప్రకృతి సోయగాల నడుమ, సాంప్రదాయ పద్ధతిలో బంధు మిత్రుల నడుమ వివాహ వేడుక జరగడం విశేషం.













