భారత దౌత్యవేత్తకు జార్జిటౌన్ వర్సిటీ పురస్కారం
ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి రాజా కార్తికేయకు అమెరికాలోని జార్జిటౌన్ వర్సిటీ నుంచి పురస్కారం దక్కింది. నాయకత్వం, సృజనాత్మకత, విలువలు, సమాజసేవ, మావన సంబంధాల పరంగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఎంఎస్ఎఫ్ఎస్ శతాద్ది ఉత్సవాలు కమిటీ ప్రకటించింది. విశాఖపట్నానికి చెందిన రాజా కార్తికేయ హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్, నిజాం కళాశాలలో విద్యనభ్యసించాడు. ఆ తర్వాత 2007-2009 లో జార్జిటౌన్ వర్సిటీలో ఎంఎస్ఎఫ్ఎస్ కోర్సు పూర్తి చేశారు. 2011 నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్నారు.













