ఆయన అసాధారణ నాయకుడు : అగ్రరాజ్యం
దివంగత భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ అసాధారణ నాయకుడని, భారత్-అమెరికా రక్షణ సంబంధాల్లో కీలక ప్రతిపాదనలు చేసిన మంత్రుడని, ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఎనలేని కృషి చేశారని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్లు కొనియాడారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులు సహా పలువురు మృతి పట్ల వారు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. రావత్ తదితరుల మృతి పట్ల అమెరికా జాయింట్ చీప్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిలే, అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బి, పలువురు చట్టసభ్యులు సంతాపం తెలిపారు.













