రష్యాకు జీ7 దేశాల హెచ్చరిక
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని జీ7 దేశాలు బెదిరించాయి. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్స్స్కీని ఒక వైపు ఎగదోస్తూ, మరో వైపు రష్యా చుట్టూ నాటో దళాలను మోహరించిన జి7 కూటమి తాజాగా ఈ బెదిరింపులకు దిగింది. ఇంగ్లండ్‌లోని లివర్పూర్లో జరిగిన జీ7 ప్రతినిధుల సమావేశం అనంతరం ఈ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ కవ్వింపు చర్యలు ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన హెచ్చరిస్తే అమెరికా దానిని చిలువలు పలువలు చేసి ఉక్రెయిన్‌పై దాడికి రష్యా పావులు కదుపుతోందని నానా యాగీ చేస్తోంది. ఈ కారణంతో రష్యాపై ఆంక్షలు విధించాలని అమెరికా యోచిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి చేసే యోచన లేదని రష్యా మరోసారి స్పష్టం చేసింది.













