సముద్రంలోకి అణువ్యర్థ జలాలు..?
ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుంచి వ్యర్థ జలాలు ..సముద్రంలోకి వదలడం ప్రపంచవ్యాప్తంగ చర్చనీయాంశమైంది. తాము వివిధ దశల్లో అణువ్యర్థ జలాలను వడపోసిన తర్వాతే సముద్రంలోకి వదులుతున్నామని జపాన్ చెబుతోంది. అయితే దీన్ని దక్షిణకొరియా, చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరీ అంత స్వార్థమా అంటూ చైనా ఘాటుగా స్పందించింది. సముద్రం అందరి ఆస్తి అని.. ఇలా వ్యర్థాలను వదలడమేంటని ప్రశ్నించింది. అణువ్యర్థజలాలను ఎంతగా శుద్ధి చేసినా, కొన్ని అణుమూలకాల ఉండిపోతాయని .. ఈ దేశాలు వాదిస్తున్నాయి. అయితే తాము అన్నింటినీ గమనిస్తున్నామని… ఏమాత్రం తేడా వచ్చినా, వెంటనే వ్యర్థజలాలను సముద్రంలోకి వదలడం నిలిపివేస్తామంటోంది జపాన్..













