ప్రిగోజిన్ కు అమెరికా హెచ్చరిక
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు ప్రకటించిన ప్రిగోజిన్‌కు భయంకరమైన ప్రాణగండం ఉందని అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) హెచ్చరించింది. ఈ మేరకు సీఐఏ చీఫ్ డేవిడ్ పేట్రాయస్ హెచ్చరికలు జారీ చేస్తూ ఎక్కడ ఉన్నా తెరిచిన కిటికీల వద్ద జాగ్రత్తగా ఉండాలి. గతంలో పుతిన్ విరోధులు చాలా మంది తెరిచిన కిటికీల్లోంచి కిందపడి ప్రాణాలను కోల్పోయారు అని వ్యాఖ్యానించారు. మరోవైపు గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి గత ఏడాది చివరి వరకు 19 మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మరణాలకు కారణాలు ఇంకా తెలియరాలేదు. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలుగా, ప్రమాదాలుగా చెబుతున్నా వీరంతా క్రెమ్లిన్‌కు ఎదురు నిలిచిన వారే కావడం గమనార్హం.













