అట్లాంటిక్ సముద్రంలో అమెరికా విన్యాసాలు

అట్లాంటిక్ మహాసముద్రంలో యూఎస్ ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ (సీవీఎన్ 78) అనే భారీ విమానవాహక నౌకకు చేరువలో అమెరికా రక్షణ విభాగం తాజాగా 18 వేల కిలోలకు పైగా బరువున్న భారీ బాంబును పేల్చింది. యుద్ధం వంటి విపత్కర పరిస్థితుల్లో పేలుళ్ల తీవ్రతను తమ నౌక తట్టుకోగలదో లేదో నిర్ధారించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.