కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల కలకలం..
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఆరెంజ్ సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆరెంజ్ సిటీలోని లికోయిన్ అవెన్యూ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తూన్న వ్యక్తి పోలీసుల ఫైరింగ్‌లో గాయపడ్డారు. దీంతో అతన్ని దవాఖానకు తరలించారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ జెన్నిఫర్ అమత్ సూచించారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు.













