అమెరికాలో మరోసారి కాల్పులు
అమెరికాలో మరోసారి కాల్పులు మోత మోగింది. అలబామా రాష్ట్రంలోని ఓ పుట్టినరోజు వేడుకలో కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలైనట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అలబామాలోని డేడ్ విల్లేలో ఉన్న ఓ డ్యాన్స్ స్టూడియోలో కొందరు యువతీ యువకులు పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. రాత్రి 10:30 గంటల సమయంలో అక్కడ ఒక్కసారిగా కాల్పుల మోత మొదలయ్యింది. బర్త్డ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన కొందరు యువకులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించి అసలేం జరిగిందనే విషయం ఇప్పుడే చెప్పలేమని అలబామా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వెల్లడిరచింది. అనుమానితులను కస్టడీలో తీసుకున్న విషయంపై స్పష్టత ఇ్వలేదు. పలు విభాగాల సహకారంతో పూర్తి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.













