ట్రంప్ కు మరో షాక్… రెండేళ్ల పాటు నిషేధం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍కు మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‍బుక్ రెండేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్‍బుక్‍తో పాటు ఇన్‍స్టాగ్రామ్ ఖాతాను ఫేస్‍బుక్ రెండేళ్లు నిలిపివేసింది. ట్రంప్ చర్యలు తమ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫేస్‍బుక్ తెలిపింది. తాజా చర్యతో 2030 వరకు ట్రంప్ ఫేస్‍బుక్ మీడియాకు దూరండా ఉండాల్సిందే. ట్రంప్‍పై నిషేధం జనవరి 7 నుంచి అమలులోకి వచ్చిందని సంస్థ గ్లోబల్ ఎఫైర్స్ వైఎస్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్గ్ తెలిపారు. కొంత కాలం తరువాత ఈ నిర్ణయంపై సమీక్ష చేపడతామని కూడా తెలిపారు.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం, జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్స్లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లు చెలరేగడానికి కారణం ట్రంప్ ఫేస్‍బుక్‍తో పాటు ఇతర సోషల్ మీడియాలో చేసిన పోస్టులేనని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఫేస్‍బుక్ చర్య తీసుకుంది. ఆయన చర్యలు మా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లే కొత్తగా వచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం విధించగలిగిన అత్యంత కఠినమైన శిక్ష ఆయనకు వేయాలని అని ఫేస్‍బుక్ పేర్కొంది. ట్రంప్ ఖాతాను ఫేస్‍బుక్ రెండేళ్ల పాటు నిషేధించడంపై వైట్‍హౌస్ సెక్రెటరీ జెన్ సాకి మీడియాతో మాట్లాడుతూ ఖాతాల నిషేధం నిర్ణయాలను ప్లాట్‍ఫామ్‍లను నడుపుతున్న సంస్థలే వదిలేయాలన్నారు. ఎన్నికలైనా, టీకాల గురించి అయినా ఫేస్‍బుక్, ట్విటర్.. మరేదైనా ప్లాట్ పారమ్ తప్పుడు సమాచార వ్యాప్తిని కంపెనీలు అరికట్టాలన్నారు.