భారత్, పాక్ కు ఒకేసారి స్వతంత్రం.. కానీ
భారత్ విదేశాంగ విధానంపై పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌కి, పాకిస్థాన్‌కి ఒకేసారి స్వతంత్రం వచ్చింది. కానీ విదేశీ వ్యవహారాల్లో భారత్ సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తుంటే పాక్‌లో షహబాజ్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగింది. ప్రధాని షెహబాజ్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం లేదు అంటూ లాహోర్‌లో ఓ ర్యాలీలో దుయ్యబట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దన్న అమెరికాకు విదేశాంగ మంత్రి జై శంకర్ గట్టిగా బదులిచ్చారంటూ మొచ్చుకున్నారు.













