అమెరికా బ్యాడ్మింటన్ కు ఇండియన్ కోచ్!
భారత మాజీ షట్లర్ శ్లోక్ రామ్‌చంద్రన్ అమెరికాలో కోచ్‌గా రాణిస్తున్నాడు. అతను నిర్వహిస్తున్న సినర్జీ బ్యాడ్మింటన్ అకాడమీ నుండి ముగ్గురు యూఎస్ జూనియర్ బ్యాడ్మింటన్ టీమ్‌లో చేరారు. బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టీమ్‌లో చేరారు. బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ల కోసం యూఎస్ జట్టును ఎంపిక చేసే ట్రయల్స్ రెండు రోజుల క్రితం డల్లాస్‌లో ముగిశాయి. పురుషుల డబ్బుల్స్లో ప్రపంచ మాజీ నంబర్ 32, శ్లోక్ 24 ఏళ్ల వయసులో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అమెరికాలో స్థిరపడ్డాడు. వాషింగ్టన్లో స్పోకేన్‌లో సెప్టెంబర్ 24` అక్టోబర్ 8 వరకు జరిగే ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ కోసం యూఎస్ బ్మాడ్మింటన్ జట్టుకు రామ్‌చంద్రన్ అధికారిక కోచ్‌గా పోటీలో ఉన్నాడు. జూనియర్ వరల్డ్స్ 23వ ఎడిషన్ అమెరికాలో జరగడం పట్ల భారత మాజీ డబుల్స్ స్పెషలిస్ట్ సంతోషం వ్యక్తం చేశాడు. తన ముగ్గురు శిష్యులతో ఫ్రాన్సిస్కా కార్బెట్, అల్లిసన్ లీ మహిళల డబుల్స్ లో 50వ ర్యాంక్ ఉన్నారు. వీరు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు.













