బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్న రిషి సునాక్
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో దూసుకుపోతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకునిగా ఆయన అభ్యర్థిత్వానికి అత్యధికంగా 40మందికి పైగా ఎంపీలు మద్దతు పలికారు. ఆర్థిక మంత్రిగా సమర్థ పనితీరు ఆయనకు మరింత కలిసొస్తోంది. రెడీ ఫర్ రిషి పేరుతో ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి ఆయన అల్లుడు కావడంతో ఈ ఎన్నికలపై భారత్‌లోనూ ఆసక్తి మరింత పెరిగింది. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాకు ఉపాధ్యక్షురాలైన నేపథ్యంలో భారత మూలాలున్న రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టిస్తారా అన్నది ఉత్కంఠ పేరుతోంది.













