ఎలాంటి కారణం లేకుండా.. చైనాపై అమెరికానే
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనకర్త అమెరికానే అని చైనా విమర్శించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ చైనాపై అమెరికా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఎలాంటి కారణం లేకుండానే చైనా అధికారులపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని అన్నారు. అమెరికా తన ఆంక్షలను తక్షణమే తొలగించని పక్షంలో తాము కూడా ప్రతిగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. జిన్జియాంగ్ ప్రాంతంలో ఉయిగర్ ముస్లిం మైనారిటీలపై చైనా ప్రభుత్వం ఊచకోతకు, నేరాలకు పాల్పడుతోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో చైనా ప్రకటన వెలువడిరది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ చైనా అధికారులను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిందని వాంగ్ విమర్శించారు.













