అమెరికాను వీడని మంచుతుపాను
అమెరికాలో మంచుతుపాను గత కొన్నిరోజులుగా బీభత్సం సృష్టిస్తోంది. సోమ, మంగళవారాల్లో కాలిఫోర్నియా, ఈశాన్య ప్రాంతాలను శీతల గాలులు, మంచుతుపాను అతలాకుతలం చేశాయి. మంగళవారం ఉదయం ప్రయాణాలు ప్రారంభం కాగానే బోస్టన్ను తుపాను తాకింది. న్యూయార్క్, మసాచుసెట్స్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఇది ప్రభావం చూపింది. అమెరికా వ్యాప్తంగా 450 విమానాల రాకపోకలు రద్దు కాగా, 500 కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఒక్లాహామాలో సుడిగాలుల తీవ్రతతో ఓ వ్యక్తి మృతిచెందారు. గాలులకు కొన్ని ఇళ్ల రేకులు ఎగిరిపడి 55 మందికి పైగా గాయపడ్డారు. ఒక్లామాలో సోమవారం రాత్రి గంటలకు 145 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు చెట్లు, విద్యుత్తు లైన్లు నేలకులాయి. లక్షలాది మంది జనం చీకట్లో మగ్గుతున్నారు.













