ఫోర్బ్స్ జాబితాలో తెలుగు తేజం
ఫోర్బ్స్ విడుదల చేసిన 30 అండర్ 30 ఏషియా క్లాస్ ఆఫ్ 2022 జాబితాను విడుదల చేసింది. ఆసియాలోని వ్యాపార, సమాజ భవిష్యత్‌ను ఈ యువత పునర్ నిర్వచిస్తున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఈ జాబితా కోసం 4000కు పైగా నామినేషన్లు ఈ ఏడాది వచ్చాయి. చివరకు ఒక్కో విభాగం నుంచి 30 మంది చొప్పున, 10 విభాగాల్లో కలిపి 300 మందిని ఎంపిక చేశారు. ఒలింపిక్స్ విజేతల నుంచి అంకురాల వ్యవస్థాపకులు వరకు ఇందులో చోటు చేసుకున్నారని ఫోర్బ్స్ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల గణిత మేధవి జొన్నలగడ్డ నీలకంఠ భాను ప్రశాక్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020లో బాన్జు అనే కమర్షియల్ ఎడ్టెక్ అంకురాన్ని ఈ యువకుడు ప్రారంభించారు. లెక్కలపై వివిధ దేశాల విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. బాన్జు పద్ధతిలో అభ్యసిస్తే విద్యార్థులు వేగంగా, మెరుగ్గా లెక్కలు చేయగలరని బాను చెబుతుంటారు. 2021 జులైలో భానుకు చెందిన అంకురానికి లైట్‌స్పీడ్ వెంచర్స్ నుంచి 2 మీ. డాలర్ల సీడ్ ఫండిరగ్ అందింది. ఇప్పటికే అంకురం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలమంది విద్యార్థులపై ప్రభావం చూపిందని అన్నారు. 17 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులే టర్గా జొన్నలగడ్డ పేరు పొందారు. 4 ప్రపంచ రికార్డులు, 50 లిమ్కా బుక్ ఆప్ రికార్డ్స్‌ను తిరగరాశారు.
ఈ జాబితాలో మొత్తం 22 దేశాల వారు చోటు దక్కించుకోగా అందులో 61మందితో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న సింగపూర్ (34), జపాన్ (33), ఆస్ట్రేలియా(32), ఇండోనేషియా (30), చైనా(28)లకు, భారత్ మధ్య అంతరం చాలా కనిపించింది. ఆగ్నేయాసియా నుంచి 90 మంది చోటు దక్కించుకున్నారు.













