ఫ్లోరిడా రాష్ట్రంలో ఘోరం… ఓ ఇంట్లో ముగ్గురి
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. ఓ చిన్నారి సహా ముగ్గురిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. వారిని కాపాడటానికి వచ్చిన పోలీసులపైనా కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఒర్లాండో నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 2:25 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో గొడవ జరుగుతున్నట్లు సమచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో నుంచి కాల్పులు శబ్దం వినిపించింది. అనంతరం బయటకు వచ్చిన నిందితుడు పోలీసులను చూసి వారి పైనా కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. మృతుల వివరాలను పోలీసులు వెల్లడించలేదు.













