విమాన ప్రయాణికులకు షాక్… భారీగా పెరిగిన
విమాన ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. విమాన టికెట్ ధరలకూ రెక్కలు వచ్చాయి. అమెరికాతో పాటు కెనడా, యూరప్ దేశాలకు ప్రయాణికులను అనుమతి స్తుండటంతో విమానాలకు డిమాండ్ పెరిగింది. వివిధ మార్గాల్లో అమెరికా ప్రయాణ టికెట్ ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్`వాషింగ్టన్ సెక్టార్లో ఈ నెలాఖరులో ప్రయాణానికి వారం, పది రోజుల కిందట రానూపోనూ టికెట్ ధర రూ.96 వేలకు లభించగా ప్రస్తుతం ఆ ధర రూ.1.18 లక్షలకు పైనే పలుకుతోంది. కొన్ని మార్గాల్లో రాకపోకల టికెట్ ధర రూ.1.30 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉంది. మరికొన్ని మార్గాల్లో టికెట్ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.













